Thursday , February 22 2018
Breaking News
Home / Breakingnews / సీఎం, మంత్రులు పేదోళ్లు

సీఎం, మంత్రులు పేదోళ్లు

download (2) download (3)

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు ఆయన కేబినెట్ మంత్రులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. సంపద విలువ కేవలం రూ. 56 లక్షలు మాత్రమే అంటూ నితీష్ ప్రకటించారు. ఆయన కంటే కుమారుడు నాలుగు రెట్లు అధిక సంపన్నుడు. కొడుకు సంపద రూ. 2.36 కోట్లుగా ఉంది. బ్యాంకులో డిపాజిట్లు, ఢిల్లీలో ఓ ప్లాటు, ఆవులు, బర్రెలు, ఒక ఎక్సర్ సైజ్ సైకిల్, చేతాలో నగదు అన్నీ కలిపి తన సంపద 56 లక్షలు మాత్రమేనని నితీష్ ప్రజల ముందుంచారు. ఇక ఉప ముఖ్యమంత్రి, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ సొంత వాహనం కూడా లేదని ప్రకటించారు. కొన్ని చోట్ల ఫ్లాట్లు మాత్రం ఉన్నాయని తెలిపారు. లాలూ మరో కుమారుడు, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ మాత్రం తన వద్ద రూ. 15 లక్షలు విలువ చేసే బైక్, రూ. 29 లక్షల విలువ చేసే కారు, దినాపూర్, పుల్వారి షరీఫ్ లలో ఫ్లాట్లు ఉన్నాయని వెల్లడించారు. మరో మంత్రి తన వద్ద ఒక రైఫిల్, ఒక పిస్టల్ ఉందని పేర్కొన్నారు. ఇ దాదాపు మంత్రులంతా తమ వద్ద తక్కువ సంపదే ఉన్నట్టు తెలిపారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే… ఇలా..దాదాపుగా మంత్రులంతా తమ వద్ద కన్నా తమ భార్యల వద్ద ఎక్కువ సంపద ఉన్నట్టు చూపించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *