Thursday , May 24 2018
Breaking News
Home / Breakingnews / బొగ్గుగని కింద 50 మంది సమాధి

బొగ్గుగని కింద 50 మంది సమాధి

download (4) images (1)

జార్ఖండ్‌లోని లాల్‌మాటియా బొగ్గుగని కుప్పకూలడంతో పలువరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ (ఈసీఎల్)కి చెందిన ఈ గని ముఖద్వారం వద్ద పెద్దఎత్తున బురదమట్టి పేరుకుపోయింది. గురువారం సాయంత్రం 8:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు జార్ఖండ్ విపత్తుల విభాగం తెలిపింది. శిథిలాల కింద 40 నుంచి 50 మంది కార్మికులు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. లోపల పలు వాహనాలు కూడా ఉన్నాయి. 8:30 గంటలకు ప్రమాదం జరిగినా.. అర్థరాత్రి దాటాక గానీ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించలేదు. ఇప్పటికి నలుగురు కార్మికులను సురక్షితంగా బయటికితీసి ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ స్వయంగా సహాయకచర్యలను సమీక్షిస్తున్నారు. సహాయక చర్యల కోసం పాట్నా నుంచి ఎన్‌డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా ఘటనా స్థలికి పంపించారు. గనుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులను కాపాడుకునేందుకు ఇప్పటికీ కోల్ ఇండియా వద్ద సరైన పరికరాలు అందుబాటులో లేవన్న విమర్శలు ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *