Thursday , May 24 2018
Breaking News
Home / Breakingnews / కౌంట్ డౌన్

కౌంట్ డౌన్

download (2)

ఏపీ ప్రభుత్వానికి పవన్ ఇచ్చిన కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. మరో రోజు మాత్రమే గడువు ఉంది. ఆ లోగా ప్రభుత్వం స్పందిస్తోందని జనసేనాని వర్గాలు భావిస్తున్నాయి. మంత్రివర్గ సభ్యులతో కూడిన కమిటీ వేయడం సాధారణంగా జరిగే పని.
భాధితుల్ని దత్తత తీసుకోవడం, నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే సమాధానం ఆధారంగా మరోసారి పవన్ గళం విప్పుతారని భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి, జనసేన పార్టీకి మధ్య కొనసాగుతోన్న కౌంట్ డౌన్ ఎటువైపు
దారితీస్తుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ, పవన్ వ్యాఖ్యల్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రస్తుతానికి మంత్రుల కమిటీ వేయడానికి సూచాయగా కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ మేరకు సిద్ధంగా
ఉన్నారని తెలుస్తోంది.
కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లకు ప్రతినిధిగా పవన్ కల్యాణ్ ను చంద్రబాబు తొలి నుంచి భావిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు చేయించిన సర్వే మేరకు పవన్ కోసం టీడీపీ చాలా కాలం వేచిచూసింది. ఎట్టకేలకు ఎన్నికల నాటికి
ఆయన్ను దరిచేర్చుకుంది. ఎన్నికల్లో గట్టెక్కింది. రాబోవు 2019 ఎన్నికల్లోనూ కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిపోకుండా పవన్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. పలు సందర్భాల్లో జగన్ అనేక అంశాలపై పోరాటాలు చేసినప్పటికీ అంతగా ప్రభుత్వం
స్పందించలేదు. కానీ, పవన్ ఏ కార్యక్రమం చేసినప్పటికీ వెంటనే ప్రభుత్వం స్పందిస్తోంది. నేరుగా చంద్రబాబునాయుడు సమాధానం ఇస్తున్నారు. రాజధాని భూముల నుంచి ప్రత్యేకహోదా, కంపెనీలకు భూముల కేటాయింపు వరకు పవన్
వ్యాఖ్యలకు కట్టుబడుతున్నారు. ఈసారి కూడా ఉద్దానం, ఇచ్చాపురం కిడ్నీ బాధితుల విషయంలోనూ పవన్ ఆవేదన మీద చంద్రబాబు శ్రద్ధ పెట్టారు. డెడ్ లైన్ లోగా స్పందించడానికి కసరత్తు చేస్తున్నారని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జనసేనాని డెడ్ లైన్ పెట్టారు. రాబోవు 48 గంటల్లో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను పరిష్కరించడానికి రూట్ మ్యాప్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, చంద్రబాబు ప్రభుత్వానికి చురకలేశారు. పుష్కరాల
ఖర్చును ప్రస్తావించారు. క్యాపిటల్ కోసం ఖర్చు చేస్తోన్న కోట్ల రూపాయల దుబారాను ప్రశ్నించారు. చనిపోతోన్న మనుషులు, అనాథలవుతోన్న పిల్లల కంటే ఏమీ ఎక్కువ కాదని దుయ్యబట్టారు. ఉద్దానం కిడ్నీ సమస్యను విపత్తుగా అభివర్ణించిన
ఆయన వైద్యశాఖను నిలదీశారు. బడ్జెట్ కేటాయింపుల్లోని 6వేల కోట్లలో 100 కోట్లు వెంటనే విడుదల చేయాలని సూచించారు. డయాలసిస్ సెంటర్లు పెట్టి చేతులు దులుపుకోవడం సమస్యకు పరిష్కారం కాదని చురకటించారు. శాశ్వత పరిష్కారం
కోసం జనసేన ఐదుగురితో కూడిన కమిటీని నియమించింది. ప్రభుత్వం స్పందించి ప్రత్యేక కమిటీని వేయాలని పవన్ కోరారు. 15 రోజుల్లో జనసేన కమిటీ నివేదిక ఇస్తుందని, దాని తీసుకుని చంద్రబాబును, ప్రజాప్రతినిధులను కలుసుకుంటానని
యాక్షన్ ప్లాన్ ప్రకటించారు.
అనాథలైన పిల్లల్ని దత్తత తీసుకోవాలని సూచించారు. ఏదో ఒక రకంగా వాళ్ల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఆర్థికంగా, వైద్య పరంగా ఏ విధంగా ప్రభుత్వం వాళ్లను ఆదుకుంటుందో 48 గంటల్లో ప్రభుత్వం
తెలియచేయాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు పవన్.
జాతీయ స్థాయి ఉద్యమానికి నడుంబిగించాలని అభిమానులకు,కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. 15 రోజుల్లో నివేదిక వచ్చిన తరువాత జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
గత 20 సంవత్సరాల వ్యవధిలో ఉద్దానం, కవిటి, ఇచ్చాపురం ప్రాంతాల్లో కిడ్నీ రోగాలతో దాదాపు 20 వేల మంది మరణించిన సంగతి తెలిసిందే. వాళ్లను పరామర్శించిన పవన్ ఇచ్చాపురం సమావేశంలో మాట్లాడారు. బాధితుల సంఖ్య లక్షలకు
చేరింది. విలేకరులతో పార్టీ కార్యకర్తలు వెళ్లిన వీడియో ట్వీట్ చేశారు. “రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులతో ఓ కమిటీని వేసి, ఈ ఉద్దానం సమస్యను గుర్తించి, ఇక్కడ జబ్బున బారినపడ్డ వ్యక్తులను ఆర్థికంగా… అలాగే వైద్య పరంగా ఎట్లా
ఆదుకుంటారన్న విషయాన్ని వెంటనే చెప్పాలి” అని పవన్ కల్యాణ్ చంద్రబాబును డిమాండ్ చేశారు. “వీటన్నింటిపైనా కమిటీ వేసి నెక్ట్స్ 48 గంటల్లో ప్రజలకు వివరించాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ 15 రోజుల తరువాత… మా జనసేన
పార్టీ నివేదికను సబ్ మిట్ చేసిన తరువాత, ఆప్పటికీ మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లని పక్షంలో ప్రజా ఉద్యమంగా సాగుతాం. నేనే స్వయంగా దీన్ని లీడ్ చేస్తానని మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నానంటూ ఏపీ ప్రభుత్వం మీద యుద్ధం
ప్రకటించారు. దీనికి ఏపీ ప్రభుత్వం ఇచ్చే సమాధానానికి ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది. ఆ లో పుగా ఎలాంటి పరిష్కారం చంద్రబాబు చూపుతారో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *