Monday , June 18 2018
Breaking News
Home / News / చిన్నమ్మకు దీప తంటా

చిన్నమ్మకు దీప తంటా

deepa-jayakumar

తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారింది. దివంగత జయలలిత మేనకోడలు పొలిటికల్ సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అక్కడి రాజకీయం వేడెక్కింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా పదవిని సొంతం చేసుకున్న శశికళకు వణుకుపుడుతోంది. అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. చెన్నై మెరీనా బీచ్ సాక్షిగా జయ మేనకోడలు దీప రాజకీయ పోరు ప్రారంభం అయింది. వేలాది మంది దీప వెంట నడిచారు. దివంగత జయ అభిమానులు, శశికళ వ్యతిరేకులు దీపకు అండగా నిలిచారు. నివాళులర్పించడానికి ఎంజీఆర్ ఘాట్ కు వచ్చిన శశికళ కు వ్యతిరేకంగా నినదించారు. దీంతో ఇధ్దరి మధ్యా రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది.
ముఖ్యమంత్రిగా జయలలిత పోయెస్ గార్డెన్లో ఉండేవారు. అక్కడికి తొలి రోజుల్లో బంధువుల, సన్నిహితులు వెళ్లేవారు.వాళ్లలో దీప ప్రముఖంగా ఉన్నారు. క్రమంగా శశికళ దగ్గరయిన తరువాత బంధువులు, సన్నిహితులకు దూరంగా జరిగారు. పోయెస్ గార్డెన్ కు అందర్నీ దూరంగా పెట్టారు. కేవలం శశికళ, జయ మాత్రమే ఉండేవారు. ఇటీవల జయ మరణం తరువాత పోయెస్ గార్డెన్ ను శశికళ స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు నుంచి దీప రాజకీయ తెరమీదకు రావాలని ప్రయత్నిస్తున్నారు. జయ వారసురాలిగా దీప పలుమార్లు మీడియా ముందుకొచ్చారు. కానీ, పెద్దగా ఎవరూ పట్టించకోలేదు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టిన తరువాత లోలోన ఆ పార్టీ అసమ్మతి పెరిగింది. వాళ్లందరూ దీప చెంతకు చేరారు. ఫలితంగా దీప వర్గం బలంగా మారింది.
ముఖ్యమంత్రి హోదాలోనే చనిపోయిన జయకు బీజేపీ నేతలు దగ్గరుండి అధికారిక లాంఛనాల్ని నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఆ రోజు నుంచి అన్నా డీఎంకే అంతర్గత వ్యవహారాల మీద పరోక్షంగా బీజేపీ ముద్ర పడింది. ఆ విషయాన్ని శశికళ భర్త నటరాజన్ బాహాటంగా వెల్లడించారు. అన్నాడీఎంకే ను పలుచన చేయడానికి బీజేపీ బయట నుంచి రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఆయన ఆరోపణలకు బలం చేకూరేలా దీప సీన్లోకి వచ్చేసింది. కాబోయే ముఖ్యమంత్రిగా ఫోకస్ అవుతోన్న శశికళకు ధీటుగా దీప తయారు అయింది. పెద్ద సంఖ్యలో మద్ధతుదారులు ఆమె వెంట నిలిచారు. ఎంజీఆర్ ఘాట్ వద్ద దీప ఫాలోయింగ్ ను చూసిన నటరాజన్ ఆమె వెనుక బీజేపీ ఉందని తేల్చాసేశారు.
నిజంగా బీజేపీ తమిళనాట రాజకీయాలపై పట్టు సాధించాలని అనుకోవడంలో తప్పులేదు. సమయం , సందర్భం చూసుకుని పక్కా ప్రణాళికను రచించడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. పైగా అమిత్ షా సారథ్యంలోని బీజేపీ దక్షిణాది రాష్ట్రాల మీద పట్టుకోసం ఉవిళ్లూరుతోంది. ఒక వైపు తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ మరో వైపు దీప తమిళనాడు రాజకీయ తెర మీదకు ఎక్కారు.వీళ్లిద్దర్నీ బీజేపీ తెర మీదకు తీసుకొచ్చిందని అన్నాడీఎంకే లోని శశికళ వర్గీయుల భావన. సీరియస్ గా బీజేపీ తెర వెనుక రాజకీయం మొదలు పెడితే, శశికళ ముఖ్యమంత్రి కావడం కలగానే మిగులుతుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వ్ం బీజేపీ అధిష్టానం ఇష్టపడే నాయకుడు. ఆయన్ను కొనసాగించడం ఆ పార్టీకి మేలు చేసేదే. కానీ, శశికళ ముఖ్యమంత్రి కోసం పావులు కదపడం బీజేపీకి మింగుపడడంలేదు.ఆమె సీఎం పదవిపై కూర్చొంటే, భవిష్యత్ బీజేపీకి అండగా ఉంటుందన్న నమ్మకం లేదు. పైగా శశికళ సీక్రెట్ ఆపరేషన్లను ప్రధాన మంత్రి మోడీ తొలుత కనిపెట్టారని వినికిడి. ఆపైన జయకు సమాచారం చేరవేసింది కూడా మోడీనే అని అప్పట్లో ప్రచారం జరిగింది. సో..నమ్మకమైన నాయకురాలిగా శశికళను బీజేపీ విశ్వసించదు. ప్రత్యామ్నాయంగా రాజకీయాలను బీజేపీ నడపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నటరాజన్ అనుమానించిన విధంగా దీప రాజకీయ తెర మీదకు బీజేపీ మద్దతుతో వస్తే..శశికళకు కౌంట్ డౌన్ ప్రారంభం అయినట్టే.

తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారింది. దివంగత జయలలిత మేనకోడలు పొలిటికల్ సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అక్కడి రాజకీయం వేడెక్కింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా పదవిని సొంతం చేసుకున్న శశికళకు వణుకుపుడుతోంది. అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. చెన్నై మెరీనా బీచ్ సాక్షిగా జయ మేనకోడలు దీప రాజకీయ పోరు ప్రారంభం అయింది. వేలాది మంది దీప వెంట నడిచారు. దివంగత జయ అభిమానులు, శశికళ వ్యతిరేకులు దీపకు అండగా నిలిచారు. నివాళులర్పించడానికి ఎంజీఆర్ ఘాట్ కు వచ్చిన శశికళ కు వ్యతిరేకంగా నినదించారు. దీంతో ఇధ్దరి మధ్యా రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రిగా జయలలిత పోయెస్ గార్డెన్లో ఉండేవారు. అక్కడికి తొలి రోజుల్లో బంధువుల, సన్నిహితులు వెళ్లేవారు.వాళ్లలో దీప ప్రముఖంగా ఉన్నారు. క్రమంగా శశికళ దగ్గరయిన తరువాత బంధువులు, సన్నిహితులకు దూరంగా జరిగారు. పోయెస్ గార్డెన్ కు అందర్నీ దూరంగా పెట్టారు.…

User Rating: Be the first one !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *