Thursday , January 19 2017
Breaking News
Home / Breakingnews / ఫీజు రీయెంబర్స్ మెంట్ డ్రామా

ఫీజు రీయెంబర్స్ మెంట్ డ్రామా

download (1) download (2)

ఫీజు రీయెంబర్స్ మెంట్ రగడ సద్దు మణిగింది. తెలంగాణ అసెంబ్లీ సజావుగా జరుగుతోంది. పేదల విద్యార్థులకు ఫీజులు
చెల్లించడానికి ప్రవేశపెట్టిన పథకం ప్రస్తుతం చతికిలపడింది. వేలాది మంది విద్యార్థులు, కాలేజీలు ఫీజుల కోసం
వేచిచూస్తోన్న పరిస్థితి. ఫీజు రీమెంబర్స్ మెంట్ అమలు చేయాలని ప్రతిపక్షాలు పలుమార్లు డిమాండ్ చేయడం జరిగింది.
విద్యార్థులతో కలిసి ఆందోళనలకు దిగిన సందర్భాలు అనేకం. కానీ, రెండున్నరేళ్ల కాలంలో ఫీజు రీయెంబర్స్ మెంట్
అమలు చేయడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దాని మీద ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీ సాక్షిగా
స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ తరువాత సీఎం స్పీచ్ మీద పలు అనుమానాలు, సందేహాలపై క్లారిఫికేషన్ తీసుకోవడం
మామూలుగా అసెంబ్లీ ప్రొసీడిగ్స్ చెప్పే పద్ధతి. తద్విరుద్ధంగా సభను వాయిదా వేయడంతో విపక్షాలు అసెంబ్లీలోనే
నాలుగు గంటల పాటు స్పీకర్ పోడియం ఎదుట బైఠాయించారు. ఆ తరువాత మార్షల్స్ తో సభ్యుల్ని ఆయా పార్టీల
అసెంబ్లీ కార్యాలయాల వద్దకు తీసుకెళ్లారు.
రాష్ట్ర విడిపోయేనాటికి ఫీజు రీమెంబర్స్ మెంట్ బకాయిలు సుమారు 1300 కోట్లకు పైగా ఉంది. ఆ మొత్తం ప్రస్తుతం
4500 కోట్లకు చేరుకుంది. ఆ మొత్తాన్ని కాలేజీలకు చెల్లించాలని విపక్షాల డిమాండ్. ఆ మొత్తాన్ని ఇప్పటికిప్పుడు
చెల్లించడానికి వీలుకాదని కేసీఆర్ తెగేసి చెప్పేశారు. పైగా అగ్రిడేషన్ కాలేజిలు, నిబంధనలు పాటించని కాలేజిలు
ఉన్నాయని చెప్పారు. దాని మీద కమిటీ నివేదిక ఉంది. చాలా కాలేజిల్లో విద్యార్థులకు సరైన నైపుణ్యం ఉండే చదువును
అందించడంలేదని తేలింది. ఆ విషయాన్ని పరిశీలించాల్సి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో విపక్ష సభ్యులు
దాని మీద క్లారిఫికేషన్ల కోసం పట్టుబట్టారు. సభను వాయిదా వేయడంతో విపక్షాలు సీఎం మీద సభా హక్కుల నోటీస్
ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. గురువారంనాడు టీడీపీ ఫీజుల రీయెంబర్స్ మెంట్ మీద వాయిదా తీర్మానాన్ని
ప్రవేశపెట్టింది. చర్చకు అనుమతించాలని డిమాండ్ చేసింది. దీంతో ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత స్వల్పకాలిక
చర్చకు స్పీకర్ అనుమతించారు.
ఫీజుల రీయెంబర్స్ మెంట్ మీద అధికార, ప్రతిపక్ష సభ్యుల అంతిమ ఆలోచన ఒకటే. కాలేజిలకు ఫీజు రీయెంబర్స్ మెంట్
మొత్తాన్ని క్లియెర్ చేయడం. ఆ బకాయిల్లో ఎక్కువగా ఆయా పార్టీలకు చెందిన ఇంజనీరింగ్ కాలేజిలు అనేకం ఉన్నాయి.
పైగా ఆయా కాలేజీలకు ప్రస్తుతం టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, పూర్వపు టీడీపీ లీడర్లు యజమానులుగా ఉన్నారు. వాళ్లకు ఆ
మొత్తాలను విడుదల చేయడానికి అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు డ్రామా నడిపిస్తున్నారు. కాలేజిలను
రద్దు చేయడానికి బదులుగా ఫీజుల రీయెంబర్స్ మెంట్ గురించి అసెంబ్లీ వేదికగా చర్చకు పెట్టారు. కాలేజిల పేరుతో
నాణ్యతాలోపం విద్య, స్టూడెంట్స్ ను ఎందుకూ పనికాకుండా చేస్తోన్న యాజమాన్యాల గురించి పల్లెత్తు మాట అనడానికి
అధికార, ప్రతిపక్ష సభ్యులకు నోరు రాలేదు. కనీసం సౌకర్యాలు లేని కాలేజిలు అనేకం హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి.
జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని పలు కాలేజిలపై తనిఖీలు నిర్వహించారు. సగానికి పైగా కాలేజిలకు అర్హత లేదని
తేలింది. వాటిని రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అయింది. కానీ, కొందరు అడ్డుకోవడంతో అనర్హత గల కాలేజిలు
కూడా ప్రస్తుతం మనగడలోనే ఉన్నాయి. వాటికి ఫీజు రీయెంబర్స్ మెంట్ ఇవ్వడం కోసం ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం
దారుణం. ప్రభుత్వం అందుకు వత్తాసు పలకడం ఘోరం. అసెంబ్లీ వేదికగా ఫీజు రీయెంబర్స్ మెంట్ పై నడుస్తోన్న
డ్రామాలోని నిజాలు బయటకు రావాలని మనం కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *