Monday , August 21 2017
Breaking News
Home / News / బాబుపై గౌతమీపుత్రుని ఎఫెక్ట్

బాబుపై గౌతమీపుత్రుని ఎఫెక్ట్

చారిత్రిక నేపథ్యం ఆధారంగా తీసిన సినిమా గౌతమీపుత్రశాతకర్ణి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో నందమూరి బాలక్రిష్ణ ప్రధాన పాత్ర పోషించారు. డైరెక్టర్ గా క్రిష్ ఉన్నారు. వాళ్లిద్దరూ సామాజికవర్గం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చెందినది.

chandra babu naidu

పైగా బాలయ్య వియ్యంకుడు కూడా. క్రిష్ దూరపు బంధువు. ఆ సినిమా జనవరి 12వ తేదీన విడుదలకు సిద్ధం అయింది. పలు రకాల పన్నుల్ని ఏపీ ప్రభుత్వం ఆ సినిమాకు రద్దు చేసింది. హీరో బాలయ్య కలిసిన వెంటన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పన్నులకు మినహాయింపు ఇచ్చారు. అంతేకాదు, చారిత్రిక నేపథ్యం ఉన్న సినిమాల్ని నిర్మించిన వాళ్లందరికీ పన్ను వినహాయింపు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. గతంలోనూ గుణశేఖర్ డైరెక్టర్ గా నిర్మించిన రుద్రమదేవికి పన్ను రాయితీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఆ చిత్రానికి ఇచ్చినట్టుగానే గౌతమీపుత్రశాతకర్ణి సినిమాకు ప్రకటించింది. కానీ, ఏపీ ప్రభుత్వం ద్వంద్వ రీతిగా వ్యవహరించింది. రుద్రమదేవి సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని డైరెక్టర్ గుణశేఖర్ ఆనాడు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు అధికారులతో కూడిన ఒక కమిటీని ప్రభుత్వం వేసింది. పన్ను రద్దు కోసం ఫైల్ ముందుకు కదిలింది. కానీ, జివో మాత్రం విడుదల కాలేదు. ఆ అంశం మీద చంద్రబాబును కలవడానికి గుణశేఖర్ చాలా రోజులు ప్రయత్నించారట. బిజీగా ఉన్న చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఆ లోగా సినిమా విడుదల అయింది. పన్ను మినహాయింపు లేకుండానే సినిమా ఆడింది.
ఇప్పుడు ఆ అంశం గౌతమీ పుత్ర రూపంలో బయటకు వచ్చింది. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాగా గుర్తించిన ఏపీ ప్రభుత్వం గౌతమీపుత్రకు మినహాయింపు ప్రకటించింది. దీంతో ఆనాటి రుద్రమదేవి అందరికీ గుర్తొచ్చింది. రుద్రమదేవికి పన్ను మినహాయింపు ఇవ్వని ఏపీ ప్రభుత్వం గౌతమీ పుత్రకు ఎందుకు ఇస్తుందని తాజాగా తలెత్తుతోన్న ప్రశ్న. బావమరది, వియ్యంకుడు హీరోగా ఉన్న బాలయ్య సినిమా కాబట్టి రాయితీలు ఇస్తోందని కొందరు విమర్శలకు దిగారు. ఆ స్థాయిలో విమర్శలకు దిగకుండా చాలా జాగ్రత్తగా రుద్రమదేవి డైరెక్టర్ ఏపీ ప్రభుత్వానికి లేఖాస్త్రాన్ని సంధించారు. ఆనాడు రాయితీ ప్రకటించనప్పటికీ ఇప్పుడైనా చంద్రబాబు గుర్తించాలని సూచించారు. చారిత్రక నేపథ్యం ఉన్న రుద్రమదేవి సినిమాకు పన్నుల్ని రీయెంబర్స్ మెంట్ చేయాలని కోరారు. ఓ న్యాయవాది ఏకంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రుద్రమదేవి సినిమాకు ఇవ్వని రాయితీలు గౌతమీపుత్రకు ఎందుకు ఇచ్చారో తేల్చాలని న్యాయపోరాటానికి దిగారు. విచారించిన కోర్టు రెగ్యులర్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న క్రమంలో తక్షణం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశంలేదని తేల్చి చెప్పింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *