Sunday , October 22 2017
Breaking News
Home / Breakingnews / రూ. 2వేలు రద్దు, బినామీ చట్టం అమలు?

రూ. 2వేలు రద్దు, బినామీ చట్టం అమలు?

download (1) download

నరేంద్ర మోడీ రేపు మళ్లీ బుల్లి తెర మీద రాబోతున్నారు. జాతి నుద్దేశించి మాట్లాడానికి సిద్ధం అయ్యారు. నవంబర్
ఎనిమిదో తేదీన ఇచ్చిన 50 రోజుల గడువు ముగియడంతో ఫలితాలను వివరించబోతున్నారు. అంతేకాదు, ఇప్పటి
నుంచి తీసుకునే చర్యల మీద వివరణ ఇవ్వబోతున్నారు.ఆ మేరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు.
డిసెంబర్ 31వ తేదీన రాత్రి మోడీ చేసే ప్రసంగంపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కీలకమైన ఐదు అంశాలను ప్రజల
ముందు ఉంచబోతున్నారు. వాటిలో ఒకటి రూ. 2వేల నోటు రద్దు ప్రధానంగా వినిపిస్తోంది. వందలోపు చిన్న నోట్లను
ప్లాస్టిక్ కరెన్సీ గా మార్చబోతున్నారు. పంట రుణాలను మాఫీ చేసే ప్రకటన చేస్తారని తెలుస్తోంది. జిరో బ్యాలెన్స్ ఉన్న
జన్ ధన్ ఖాతాల్లో కనీసం రూ. 10వేల జయచేయడానికి సిద్ధం అవుతున్నట్టు సమాచారం. నగదు ఉపసంహరణ పై
ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం నాలుగో అంశంగా వినిపిస్తోంది. ఇక చివరిగా బినామీ ఆస్తులపై తీసుకునే చర్యల గురించి
ప్రకటిస్తారని కేంద్ర ఆర్థికశాఖ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *