Thursday , February 22 2018
Breaking News
Home / News / అమరావతి వెలగపూడిలో త్వరలోనే జరగబోయే ఏపీ బడ్జెట్ సమావేశాలు

అమరావతి వెలగపూడిలో త్వరలోనే జరగబోయే ఏపీ బడ్జెట్ సమావేశాలు

navyandhranavyandhra

త్వరలోనే జరగబోయే ఏపీ బడ్జెట్ సమావేశాలు అమరావతి వెలగపూడిలో నిర్మిస్తున్న కొత్త అసెంబ్లీలో జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. తుది దశలో ఉన్న అసెంబ్లీ నిర్మాణం పనులు దాదాపుగా పూర్తి కావొస్తున్నాయి. ఇక వెలగపూడిలోని కొత్త అసెంబ్లీ ఎన్నో ప్రత్యేకతలకు వేదిక కానుంది. ఈ భవనాల నిర్మాణానికి జర్మనీ నుంచి అత్యాధునిక పరికరాలను దిగుమతి చేసుకున్నారు. మైకు, వాయిస్ రికార్డర్ కలిపి ఒకే పరికరంగా టేబుల్ లోపల అమర్చి ఉంటుంది. ఎవరైనా సభ్యుడు కోపంతో మైకు విరగ్గొట్టాలన్నా… అది ఇక్కడ సాధ్యంకాదు. ఇక సభ్యులు నోటికొచ్చి మాట్లాడటం కూడా ఈ సభలో చెల్లదు. ఎందుకుంటే ఏది మాట్లాడిన ఇక్కడ ఇట్టే రికార్డ్ అవుతుంది.

తర్వాత మేము అలా అనలేదని చెప్పినా లాభం ఉండదు. సాకులు చెప్పి తప్పించుకోవడం సాధ్యంకాదు. ప్రతి సభ్యుడి ముందు ఉండే వాయిస్ రికార్డర్ వారి ప్రతి మాటను రికార్డ్ చేస్తుంది. ఇక స్పీకర్ పోడియం దగ్గర అల్లరి చేసే అవకాశం ఈ అసెంబ్లీలో ఉండదు. పోడియం పైకి ఎక్కి అల్లరి చేయకుండా దీన్ని నిర్మిస్తున్నారు. ఇక సభలో సభ్యులు మాటలు ప్రతిధ్వనించకుండా స్పష్టంగా వినిపించేలా అధునాతన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. అలాగే అని చోట్ల స్పష్టమైన లైటింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా మరిన్ని అత్యాధునిక హంగులతో నిర్మించబడుతున్న ఈ అసెంబ్లీ భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.⁠⁠⁠⁠

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *