Sunday , October 22 2017
Breaking News
Home / Breakingnews / కారు కొనుగోలుకు కొత్త నిబంధన

కారు కొనుగోలుకు కొత్త నిబంధన

european-cars-parking-spaces-along-road-residential-area-54932603 images

కారు కొనుగోలుపై కేంద్రం ఆంక్షలు పెట్టడానికి సిద్దం అవుతోంది. పార్కింగ్ ప్లేస్ సర్టిఫికేట్ చూపిస్తేనే ఇక కారు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆ మేరకు నిబంధనల్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర ఉపరితల రవాణ, పట్టణ శాఖ మంత్రులు సూత్రప్రాయంగా ఆ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దీంతో ఇక చట్టరూపంలోకి రావడానికి ప్రక్రియ ప్రారంభం అయింది.
ప్రస్తుతం మెట్రోపాలిటిన్ సిటీల్లో పార్కింగ్, కాలుష్య సమస్య ఉంది. ఢిల్లీ, కలకత్తా, ముంబాయి, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి సిటీల్లో పార్కింగ్ సమస్య తీవ్రతరం అయింది. ఇలాంటి పరిస్థితి సిటీల్లోనూ నెలకొంటోంది. దీనికి నివారణగా కారు కొనుగోలు చేయడానికి ముందు పార్కింగ్ సర్టిఫికేట్ కొనుగోలు చేసే నిబంధన రానుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ నిబంధన ఉంది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఓ కేసు విషయంలో తీర్పు చెబుతూ కారు కొనుగోలు చేయడానికి ముందుగా పార్కింగ్ సర్టిఫికేట్ చూపాలని సూచించింది. దీంతో కేంద్రం ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టింది. కానీ, పలువురు దీనిపై భిన్నాభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు. కార్ల రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచాలని కొందరు సూచిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఆధునాతనంగా చేయడం మరో మార్గంగా రవాణాశాఖ నిపుణులు ఇస్తోన్న సలహా. పార్కింగ్ ప్లేస్ సర్టిఫికేట్ నిబంధనకు ప్రత్యామ్నాయాలు చూడాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *