Wednesday , June 28 2017
Breaking News
Home / Breakingnews / శ్రీకాకుళం సిద్ధం

శ్రీకాకుళం సిద్ధం

download (4) download (5)

మళ్లీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభను నిర్వహిస్తున్నారు. ఈసారి శ్రీకాకుళం జిల్లా ను ఎంచుకున్నారు. ఆ సభ
నుంచి ఏం మాట్లాడబోతున్నారోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే తిరుపతి, వెస్ట్ గోదావరి, అనంతపురం
జిల్లాల్లో సభలు నిర్వహించారు. అక్కడ ప్రత్యేకహోదా గురించి మాట్లాడారు. ఆ తరువాత ట్వీట్ల ద్వారా బీజేపీ మీద
విరుచుకు పడ్డారు. దాని కొనసాగింపుగా శ్రీకాకుళం వేదిక నుంచి బీజేపీ మీద సమరశంఖం పూరిస్తారని సేన వర్గాల
ఉవాచ. ఆయన పర్య‌ట‌న కోసం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ అభిమానులు భారీ ఏర్పాట్లు చస్తున్నారు. ఉదయం
జిల్లాలోని ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్‌ ప్రాంగణంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను ప‌రామ‌ర్శిస్తారు. అందుకు
సంబంధించిన రోగుల జాబితాను జన‌సేన నేత‌లు సిద్ధం చేశారు. ఆ తరువాత రోడ్ షో లోనూ పవన్ క‌ల్యాణ్ పాల్గొంటారు.
ఆ మేరకు పవన్ అభిమానులు సూచాయగా మీడియా లీకిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *