Thursday , February 22 2018
Breaking News
Home / Breakingnews / టీ కప్పులో తుఫాన్

టీ కప్పులో తుఫాన్

download (1) download

హైడ్రామా ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ లో ముగిసింది. టీ కప్పులో తుఫాన్ మాదిరిగా సమసిపోయింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిన ఎస్పీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ వెనక్కు తగ్గారు. సస్పెన్షన్ ను ఎత్తివేశారు. ఇద్దరు మధ్య అభ్యర్థుల ఎంపిక జాబితా రేపిన చిచ్చు చల్లారింది. మధ్య మార్గంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది.
ఎస్పీ నేత అమర్ సింగ్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి విభేదాలకు బీజం పడింది. అప్పటి నుంచి ములాయంసింగ్ యాదవ్ తమ్ముడు శివపాల్ యాదవ్, అఖిలేష్ మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఆనాటి నుంచి ప్రచ్చన్న యుద్ధం వాళ్లిద్దరి మధ్యా జరిగింది. పచ్చగడ్డి వేస్తే భగ్గమనేంత రాజకీయ విరోధం నెలకొంది. ఆ క్రమంలో ములాయం ఇద్దరి మధ్యా సఖ్యత కుదిర్చారు. ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. అభ్యర్థుల ఎంపిక మీద ఇధ్దరి మధ్య మళ్లీ విభేదాలకు కారణం అయింది. రాత్రికి రాత్రి అఖిలేష్ ను ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేస్తూ ములాయం నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఎస్పీ రాజకీయం మలుపు తిరిగుతుందని అనుకున్నారు. కానీ, తెల్లారేటప్పటికి ములాయం కుటుంబం సర్దుకుంది. అంతా ఒకటే అన్న సంకేతాలు ఇవ్వడం కొసమెరపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *