Thursday , February 22 2018
Breaking News
Home / Highlights / నువ్వులతో నూరేళ్ళు

నువ్వులతో నూరేళ్ళు

sesame-seeds

నువ్వులతో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. బీపీ, షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. నువ్వుల్లో మాంసకృత్తులు, అమినోయాసిడ్‌లు సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం శాతం కూడా అధికంగా ఉంటుంది. నువ్వుల నూనె వాడటం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. నువ్వులు తెల్లవి, నల్లవి ఉంటాయి.

నల్ల నువ్వుల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తహీనతతో బాధపడేవారు, బలహీనంగా ఉండేవారు ఈ నువ్వులను ఆహారంగా తీసుకుంటే మంచిది. నువ్వుల్లో సెసమాల్‌ అనే యాంటీయాక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ప్లెంటరీ పదార్థం ఉంటుంది. ఇది హుద్రోగం నుంచి కాపాడుతుంది. నువ్వుల్లో ఉండే మోనోశాచురేటెడ్‌ కొవ్వు శాతాన్ని నియంత్రిస్తుంది. నువ్వుల్లో ఉండే పీచుపదార్థాం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తనాళాలు, ఎముకలు, కీళ్ల్లు, సక్రమంగా పనిచేసేందుకు నువ్వులు ఎంతగానో దోహదపడుతాయి. నువ్వులను తరచూ ఆహారంగా తీసుకుంటే ఉబ్బసం నివారించవచ్చు. వీటిలో ఉండే జింక్‌, కాల్షియం ఎముకలను పటిష్టంగా ఉంచుతాయి.

నువ్వు మొక్కలను కాల్చి, మసి చేసి పెరుగుతో కలిపి మూడు రోజులపాటు తీసుకుంటే మూత్ర పిండాల్లో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. పల్లేరుకాయలు, నువ్వు పువ్వులు, తేనె సమపాళ్లలో మెత్తగా నూరి కేశాలు రాలినచోట రుద్దితే తిరిగి జుట్టు పెరుగుతుంది. నల్లనువ్వుల ముద్దలో 5వ వంతు చక్కెర కలిపి, మేకపాలతో తీసుకుంటే రక్త విరోచనాలు తగ్గుతాయి. నువ్వుల ముద్దను వెన్నతో కలపి నెల రోజులపాటు తీసుకుంటే రక్తమొలలు మాయమవుతాయి.

నువ్వుల నూనె చర్మాన్ని మృధువుగా ఉంచుతుంది. నూనె ముఖానికి రాసుకొని మర్ధన చేసుకొని, శనగ పిండితో నలుగు పెట్టి, గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖం తాజాగా ఉంటుంది. పాదాలకు పగుళ్లు ఉన్నచోట నువ్వుల నూనె రాసుకొని, సాక్సులు వేసుకుంటే పగుళ్లు తగ్గుముఖం పడుతాయి.
నువ్వుల నూనెలో ఒమేగా 3, 6, 9 ప్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ ఇస్తాయి. నువ్వుల నూనెను తరుచూ తలకు మర్ధనచేసుకుంటే తలలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. తద్వారా జుట్టుకుదుళ్లు దృఢంగా తయారవుతాయి. జుట్టు పొడిబారడం, రాలడం, పలుచబడటం తదితర సమస్యలను దూరం చేస్తాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్న నువ్వులను ఈతరం వారు పెద్దగా ఉపయోగించకపోవడం దురదృష్టకరం.

నువ్వులతో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. బీపీ, షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. నువ్వుల్లో మాంసకృత్తులు, అమినోయాసిడ్‌లు సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం శాతం కూడా అధికంగా ఉంటుంది. నువ్వుల నూనె వాడటం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. నువ్వులు తెల్లవి, నల్లవి ఉంటాయి. నల్ల నువ్వుల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తహీనతతో బాధపడేవారు, బలహీనంగా ఉండేవారు ఈ నువ్వులను ఆహారంగా తీసుకుంటే మంచిది. నువ్వుల్లో సెసమాల్‌ అనే యాంటీయాక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ప్లెంటరీ పదార్థం ఉంటుంది. ఇది హుద్రోగం నుంచి కాపాడుతుంది. నువ్వుల్లో ఉండే మోనోశాచురేటెడ్‌ కొవ్వు శాతాన్ని నియంత్రిస్తుంది. నువ్వుల్లో ఉండే పీచుపదార్థాం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తనాళాలు, ఎముకలు, కీళ్ల్లు, సక్రమంగా పనిచేసేందుకు నువ్వులు ఎంతగానో దోహదపడుతాయి. నువ్వులను తరచూ ఆహారంగా తీసుకుంటే ఉబ్బసం నివారించవచ్చు. వీటిలో ఉండే జింక్‌, కాల్షియం ఎముకలను పటిష్టంగా ఉంచుతాయి. నువ్వు మొక్కలను కాల్చి, మసి చేసి పెరుగుతో కలిపి…

User Rating: Be the first one !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *