Thursday , February 22 2018
Breaking News
Home / Breakingnews / వెన్నుపోటు బాధితులు

వెన్నుపోటు బాధితులు

download (3) download

ఉత్తర ప్రదేశ్ రాజకీయ లక్నో నుంచి ఢిల్లీకి చేరుకుంది. సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ మీద తండ్రీకొడుకులు
ములాయం, అఖిలేష్ యుద్ధం ప్రారంభం అయింది. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి ములాయం సిద్ధం
అయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు లేకుండా పెట్టిన కార్యవర్గ సమావేశం చెల్లదని ఫిర్యాదు చేయాలని
నిర్ణయించుకున్నారు. మరోవైపు జాతీయ కార్యవర్గం ఆమోదించిన మినిట్స్ ను ఎన్నికల కమిషన్ కు అందచేయడానికి
అఖిలేష్ సిద్దం అవుతున్నారు. ఇలా ఇధ్దరూ పోటాపోటీగా కమిషన్ ఎదుట ఫిర్యాదు చేసుకోబోతున్నారు.
వాస్తవంగా ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ ఎపిసోడ్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 1996లో నడిచింది.
ఆనాడు ఎన్టీఆర్ ను దింపడానికి ఇలాంటి ఎపిసోడ్ ను చంద్రబాబు నడిపారు. లక్ష్మీ పార్వతి రూపంలో పార్టీకి నష్టం
వాటిల్లుతోందని భావించిన చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్ ను దించేశారు. వైస్రాయ్ హోటల్ కేంద్రంగా
ఎమ్మెల్యే శిబిరాలను నడిపారు. మెజార్టీ ఎమ్మెల్యేను కూడగట్టుకున్న చంద్రబాబు గవర్నర్ వద్ద పేరెడ్ చేశారు. ఎన్టీఆర్
ను పదవీచ్యుతుడ్ని చేశారు. ఆ తరువాత పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్ ను తప్పించారు. జీవిత కాల అధ్యక్షునిగా
ఉన్న టీడీపీ గుర్తును ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ను ఎన్టీఆర్ ఆశ్రయించారు. దాని మీద చంద్రబాబు సుప్రీం కోర్టుకు
వెళ్లారు. తుదకు చంద్రబాబుకు సైకిల్ గుర్తు దక్కింది. ఆ తరువాత ఎన్టీఆర్ సింహం గుర్తుతో ఎన్టీఆర్ టీడీపీని
పెట్టుకున్నారు. ఆయన మరణం తరువాత ఇటీవల ఆ పార్టీ గుర్తింపును కమిషన్ రద్దు చేయడం జరిగింది. సరిగ్గా
ఇలాంటి ఎపిసోడ్ ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీలో చోటుచేసుకోంది. కాకపోతే, ఏపీలో మామ అల్లుళ్ల మధ్య అక్కడ
తండ్రీ కొడుకుల మధ్య రాజకీయ పోరు. అంతకు మినహా ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలన్నీ ఏపీలో
ఎన్టీఆర్ ఎపిసోడ్ ను పోలి ఉన్నాయి.
ములాయంకు వెన్నుపోటు పొడిచిన అఖిలేష్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. తండ్రిని సునాయాసంగా పక్కన
పెట్టేశారు. అభ్యర్థుల్ని ఖరారు చేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకున్నారు. పార్టీ నుంచి తండ్రిని గెంటేశారసు.
కేవలం కాపలాదారుగా మాత్రమే పెట్టారు. సైకిల్ గుర్తు కోసం అఖిలేష్, ములాయం సింగ్ యాదవ్ పోరాటం ఎంత వరకు వెళుతుంది? కమిషన్ ఎవరికి ప్రాధాన్యం ఇస్తుంది? ఆ తరువాత కోర్టుకు వెళతారా?ఆ లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *