Thursday , May 24 2018
Breaking News
Home / Breakingnews / హిట్ లిస్ట్ లో వెంకయ్య

హిట్ లిస్ట్ లో వెంకయ్య

Venkaiah-Naidu

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు వేదికల మీద కనిపిస్తుంటారు. పరస్పరం పొగుడుకుంటారు. సమర్థులైన నాయకులుగా ఒకరి గురించి మరొకరు చెప్పుకోవడం చూస్తుంటాం. ఏపీలో జరిగే ప్రతి కార్యక్రమానికి వెంకయ్య హాజరవుతారు. ఇధ్దరూ వేదికను పంచుకుంటారు. కేంద్ర మంత్రులు ఎవరి వచ్చినా, రాకపోయినా…వెంకయ్య ప్రతి కార్యక్రమానికి వస్తారు. ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు, ఇతరత్రా ప్రైవేటు కార్యక్రమాలకు ఇధ్దరూ హాజరవుతారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే ప్రతి కార్యక్రమానికి నాయుడు బ్రదర్స్ కనిపిస్తుంటారు. కానీ, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు ప్రధాన మంత్రి మోడీ తో పాటు వెంకయ్యనాయుడు లేకపోవడం రాజకీయంగా చర్చ చోటుచేసుకుంది.
పూర్వం నుంచి వెంకయ్య నాయుడు అద్వానీ అనుచరుడు. ఆయన కనుసన్ననల్లోనే నడుస్తుంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా అద్వానీ మద్ధతు ఉంది. జాతీయ రాజకీయాల్లో అద్వానీ మాటకు కట్టుబడి ఉంటారు. ప్రధాన మంత్రిగా వాజ్ పేయ్ ఉన్న సమయంలోనూ అద్వానీ సూచనల మేరకు ఏపీ రాజకీయాన్ని నడిపారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మద్ధతును ఎన్డీఏకి సమకూర్చడంలోనూ వెంకయ్య పాత్ర కీలకం. అప్పట్లో కేంద్ర హోంమంత్రిగా ఉన్న అద్వానీ అన్నీ తానై రాజకీయాలు నడిపేవారు. అద్వానీ శిష్యునిగా వెంకయ్య తెలుగు రాష్ట్రాల మీద రాజకీయంగా పట్టు సాధించారు. ఆయన అనుచర గణానికి కీలకమైన పదవులు దక్కించుకున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వెంకయ్యనాయుడు చెప్పకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏమీ జరిగేది కాదు. ఆనాటి అనుభవాలు, అద్వానీ శిష్యరికాన్ని ప్రస్తుతం అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ గుర్తు చేసుకుంటోంది. తెలుగు రాష్ట్రాల మీద పట్టు సాధించడానికి వెంకయ్య పాత్ర ఎంత ఉండాలో అంచనా వేస్తోంది. ఆయన్ను తప్పించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏపీలో బీజేపీ బలపడాలని భావిస్తోంది.
కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు ప్రస్తుతం ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ అద్వానీ శిష్యరికానికి దూరం కాలేదు. దీంతో వెంకయ్య కదలికల్ని ఒక కంట మోడీ వర్గం గమనిస్తూనే ఉంది. నోట్ల రద్దు తరువాత దేశ వ్యాప్తంగా జరుగుతోన్న రాజకీయ పునరేకీకరణ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీకి వ్యతిరేకంగా ఒంటి కాలుతో లేస్తున్నారు. టీడీపీకి మాత్రం దూరం కావడంలేదు. మోడీని తరచూ విమర్శిస్తున్నారు. నోట్ల రద్దును తొలుత సమర్థించిన చంద్రబాబు ఆ తరువాత అమలు చేస్తోన్న ప్రక్రియను తప్పుబట్టారు. పరోక్షంగా కేంద్రం మీద విమర్శల కురిపిస్తున్నారు. ఇంకో వైపు వెంకయ్య వ్యవహారశైలి మీద కేంద్రానికి అనుమానం కలిగిందని ఢిల్లీ వర్గాల వినికిడి. ఆ క్రమంలోనే వెంకయ్యను మోడీ అండ్ టీం దూరంగా పెడుతోందని తెలుస్తోంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం తాజాగా జరిగిన మోడీ తిరుపతి సైన్స్ కాంగ్రెస్ వేదిక. ఆ సమావేశానికి వెంకయ్య హాజరు కాలేదు. రాష్ట్రానికి ఆయన వచ్చినప్పటికీ మోడీ సభకు హాజరు కాకపోవడంపై సీనియర్ పొలిటీషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. ఇద్దరికీ చెడకపోతే, ప్రధాన మంత్రి తిరుపతి సైన్స్ కాంగ్రెస్ వేదిక మీద ఎందుకు కనిపించలేదని నిలదీస్తున్నారు. అంతేకాదు, గైర్హాజరు వెనుక ఉన్న నిజం చెప్పాలని, లేదంటే చరిత్ర హీనులుగా మిలిపోతారని విమర్శించడం రాజకీయ చర్చకు దారితీసింది. ఉండవల్లి ఆరోపణలు పక్కన పెడితే, చంద్రబాబుకు ఈ మధ్య కాలంలో వెంకయ్య బాగా దగ్గరవుతున్నారు. ప్రధాన మంత్రి మోడీకి క్రమంగా దూరం జరుగుతున్నారని ఢిల్లీ వర్గాల గుసగుసలు. మోడీ హిట్ లిస్టులో తాజాగా వెంకయ్య పేరు చేరిందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో భవిష్యత్ తెలుగు భారతాన్ని నాయుడు బ్రదర్స్ ఎలా నడిపిస్తారో చూడాలి.

డైరెక్టరేట్ భారీ జరిమానా విధించింది. పెరా ఉల్లంఘన కేసులో దినకరన్ కు ఈడీ 28 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించినట్టు మద్రాసు హైకోర్టు ధ్రువీకరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *